ఆఫ్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు

ఆఫ్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు

కాబూల్: ఆప్ఘానిస్తాన్‎లో శుక్రవారం (ఏప్రిల్ 3) రాత్రి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‎పై 5.9గా నమోదైంది. భూకంప కేంద్రం హిందూ కుష్ ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప ప్రభావం ఇండియాలో కూడా కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు  నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. 

పంజాబ్‌లోని నోయిడా, చండీగఢ్, లుధియానా, జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, శ్రీనగర్, ఉధంపూర్, డెహ్రాడూన్‌తో సహా పలు నగరాల్లో భూమి కంపించింది. ఆకస్మిక భూ కుదుపులతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లు, కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. 

►ALSO READ | ఎంత కావాలంటే అంత.. చమురు సప్లయ్ కి సిద్దంగా ఉన్నాం: రష్యా ఆఫర్